YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

ఏలాంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి మధుసూదన్ నాయక్ కోరారు. ఈ నెల 10 నుండి 24 వరకు నిర్వహించనున్న పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్ల విషయమై  శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 866 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకుగాను నాగర్ కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జడ్.పి.హెచ్.ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు గాను ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంట్ అధికారులను నియమించటం జరిగిందని, అలాగే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ను నియమిస్తున్నామని తెలిపారు. ఈనెల 10వ తేదీ నుండి 24వ తేదీ వరకు పదవ తరగతి సప్లిమెంటరీపరీక్షలు నిర్వహించే కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ విధిస్తున్నట్లు డిఆర్ఓ వెల్లడించారు. అంతేకాక పరీక్షల సమయంలో చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా వేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
       పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు తాగునీరు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఓ ఆర్ ఎస్ పాకెట్లు, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలని, పరీక్షలు నిర్వహించిన అన్ని రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ మండలాల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలపై సమీక్ష
     ఈ సందర్భంగా ఆయన ఈ నెల 7 నుండి 14 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల పై కూడా సమీక్ష నిర్వహించారు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు అవసరమైన ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులతో కోరారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 17 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 5410 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారని, ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఇంటర్ రెండవ సంవత్సరం  పరీక్షలు ఉంటాయని అని తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా రెవెన్యూ శాఖ తరపున ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తామని, తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పదవతరగతి పరీక్షలు లాగానే జిరాక్స్ కేంద్రాలను మూసి వేయడం జరుగుతుందని తెలిపారు.
       జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావు, పోస్టల్ అసిస్టెంట్ కే గీతారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్వామి, ఆరోగ్య శాఖ నుండి మోహన్, ట్రాన్స్కో ఏఈ మహేష్, డి టి ఓ లక్ష్మీనారాయణ తదితరులు ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 

Related Posts