ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి కన్నడ నటుడు, సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్- సీనియర్ నటి సుమలత పరస్పరం ఢీకొన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలత ఘన విజయం సాధించారు. తనపై విజయం సాధించిన సుమలతను అభినందిస్తూ నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.తాను అనుబంధాలకే ప్రాధాన్యం ఇస్తానని, ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయం చెప్పానన్న నిఖిల్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సుమక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు. సుమలత కుమారుడు అభిషేక్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.