YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాకు ఆర్థిక సంక్షోభం..? 

Highlights

  • ఇన్నొవేషన్, క్యాపిటలిజం మెరుగైతేనే 
  • 2008 ఆర్థిక సంక్షోభం
  • 88 లక్షల ఉద్యోగాలను కోల్పోయిన అమెరికన్లు
  •  అవుననే అంటున్నారు బిల్ గేట్స్
అమెరికాకు ఆర్థిక సంక్షోభం..? 

అగ్రరాజ్యమైన  అమెరికా ప్రమాదం అంచున ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో సారి అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అగ్రరాజ్యం అమెరికాను వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదం మరోసారి పొంచి ఉందా అన్న ప్రశ్నకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్  స్పందిస్తూ.. ఔను అని పక్కాగా చెప్పడం కష్టమే అయినప్పటికీ... అలాంటి సంక్షోభం మరోసారి రావడం మాత్రం తథ్యమని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని... అయితే ఇన్నొవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్నుంచి బయటపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా... 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం సమీప భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశం ఉందా? అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అమెరికా అతలాకుతలం అయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలను అమెరికన్లు కోల్పోయారు. 19 ట్రిలియన్ డాలర్ల (రూ. 19 లక్షల కోట్ల డాలర్లు)కు పైగా ప్రజా సంపద హరించుకుపోయింది. నివాసాలను కోల్పోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.  

Related Posts