YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కనీసం 40 వేల కోట్లు కావాలి

కనీసం  40 వేల కోట్లు కావాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ఏపీది లోటు బడ్జెట్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఇదే విషయాన్ని చాలాసార్లు చెబుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఎలా గట్టెక్కుతారో చూడాలి. నిధుల లభ్యత, ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఏపీ ప్రభుత్వానికి రూ.39,815 కోట్లు అవసరమని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. లోటు ఉన్నందున ఈ మేరకు ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలని కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. ఇకపోతే ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2,26,178 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ రూపొందించిన విషయం తెలిసిందే. అప్పుడు ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు. అయితే తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్థిక లోటు మరిన్ని రూ.కోట్లు పెరిగే అవకాశముంది. రాష్ట్ర ఆదాయం మొత్తంగా రూ.26,278 కోట్ల మేర తగ్గొచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన కొత్త పథకాల అమలుకు, ఇతరత్రా వాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,615 కోట్లు అదనంగా అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. పింఛన్ల పెంపు, వాలంటీర్ల నియామకం, గ్రామసచివాలయాల్లో ఉద్యోగాలు వంటి అంశాలున్నాయి.

Related Posts