YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడుగా గుంటూరు జిల్లా

మూడుగా గుంటూరు జిల్లా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
 

కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజవర్గాలు, మండలాలు, గ్రామాలు, చదరపు విస్తీర్ణం, మొత్తం జనాభా వివరాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పంపాలని కోరింది. ఈమేరకు జిల్లా అధికారులు జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను పొందుపరుస్తూ ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి పంపారు. వైౖసిపి అధికారంలోకి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న గుంటూరుతో పాటు కొత్తగా నర్సరావుపేట, బాపట్ల జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. అయితే బాపట్ల పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలుగుంటూరు జిల్లాలో, నాలుగు ప్రకాశం జిల్లాల్లో ఉండటం వల్ల జిల్లా కేంద్రం ఎక్కడ పెడతారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకాశం జిల్లా అద్దంకి,సంతనూతలపాడు నియోజకవర్గాలు బాపట్లకు దూరం కావడం వల్ల బాపట్ల జిల్లాను ప్రకాశం పరిధిలోకి తీసుకువస్తారన్న ప్రచారం ఉంది. ఏడు అసెంబ్లీ స్థానాలు కలిపి నర్సరావుపేట విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లా మొత్తం నైసర్గిత విస్తీర్ణం 11,391 చదరపు కిలో మీటర్లు. ఇందులో గుంటూరు లోక్‌సభ విస్తీర్ణం 3446 చదరపు కిలో మీటర్లు ఉండగా నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గం విస్తీర్ణం 4598 చదరపు కిలో మీటర్లుగా పేర్కొన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పల్నాడు పరిధిలో చాలా ఎక్కువగా ఉంది. విజయపురి సౌత్‌ నుంచి గుంటూరు రావాలంటే 100 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంది. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి ప్రాంతం నుంచి గుంటూరు రావాన్నా 120 కిలో మీటర్లు దూరం రావాల్సి ఉంది. నర్సరావుపేట, పిడుగురాళ్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అయితే పల్నాడు ప్రాంత వాసులకు కొంత వెసులుబాటు ఉంటుందనే వాదన ఉంది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక కార్యచరణ ప్రకటిస్తారని తెలిసింది. మొత్తంగా జిల్లాల సరిహద్దుల నిర్ణయం, జిల్లాలకు కొత్త పేర్లు, వనరులు, అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం జరగాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ,జిల్లా స్థాయిలో ఉన్నతా స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తారని తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రాధాన్యత క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారిస్తారని అందువల్ల అన్ని వివరాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు సూచించా

Related Posts