యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ ఉద్యోగవిరమణ తరువాత బెంగళూరు లో ఒక ప్రయోగశాల నెలకొలపాలని నిర్ణయించుకుని ముగ్గురు ఉద్యోగులను ఎంచుకోవడానికి దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.
చాలామంది తమకు ఉద్యోగం వచ్చినా రాక పోయినా ఆ మహానుభావుని కలవవచ్చు అనే ఉద్దేశ్యం తో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.
కొంత వడపోత తరువాత ఐదుగురిని ఎంపిక చేసి వారిలో ముగ్గురిని తీసుకోవడానికి స్వయంగా సి.వి. రామన్ వారిని ఇంటర్వ్యూ చేశారు. వారిలో ముగ్గురిని ఎంపిక చేసుకున్నారు.
మరుసటి రోజు సి.వి. రామన్ ఉదయపు నడక కోసం బయటికి రాగానే అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు నిన్న ఇంటర్వ్యూ లో ఉద్యోగం పొందలేక పోయిన ఇద్దరిలో ఒకడు. ఏమి సంగతి అని రామన్ కుర్రవాడిని పలకరించాడు. నిన్న ఇంటర్వ్యూ కోసం నేను మీ కార్యాలయం లో ఫీజు చెల్లించినప్పుడు మీ అకౌంటెంట్ పొరబాటున నాకు ఏడు రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, అవి తిరిగి ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆ యువకుడు. దానికి రామన్ నవ్వి పరవాలేదు ఉంచేసుకో, నీ ఖర్చులకు వాడుకో అన్నారు ఆ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటూ.
ఆ కుర్రవాడు ఆ ఏడు రూపాయలను తన వద్ద ఉంచుకోవానికి ఇష్టపలేదు. రామన్ కి ఇచ్చివేసి తన దారిన తానూ పోతున్నాడు. రామన్ ఆ కుర్రవాడిని పిలిచి మరుసటి రోజు తన ఆఫీసులో తనను కలవవలసిందిగా కోరాడు. ఆయనతో మరోసారి కలవవచ్చని, మాట్లాడవచ్చని ఆ కుర్రవాడు ఆనందంతో వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఆ కుర్రవాడు రామన్ ను తన కార్యాలయంలో కలిసాడు. *"నువ్వు భౌతిక శాస్త్రంలో మాదగ్గర ఫెయిల్ అయిఉండవచ్చూ కానీ నిజాయితీ లో పాస్ అయ్యావయ్యా! అందుకే నీకోసం మరో కొత్త ఉద్యోగం సృష్టించాను. వెంటనే వఛ్చి జాయిన్ అవ్వు!* అన్నాడు రామన్. ఆ కుర్రవాడు ఆనందపడ్డాడు.
ఆ కుర్రవాడి తరువాత కాలంలో (1983)లో నోబెల్ బహుమతి పొందిన ప్రో. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్(బహుమతి వచ్చేనాటికి అతడు US పౌరుడు)
ఏడు రూపాయలు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో అతడు ఒక పుస్తకం కూడా రాసాడు.
*మన తెలివి తేటలలో, విజ్ఞానంలో లోపం ఉంటె దానిని కష్టపడం ద్వారా, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా ఇతరుల మార్గదర్శకత్వం ద్వారా, సహాయం ద్వారా అధిగమించవచ్చు. కానీ, నిజాయితీ కలిగిన వ్యక్తిత్వంలో, విలువలు పాటించడంలో వెనకబడితే మనం జీవితంలో పురోగమించలేము*
అందుకే ఐన్ స్టీన్ ఏమంటాడంటే: *విజయం కోసం పాటుపడే వ్యక్తిగా ఉండేకంటే, విలువలు కోసం నిలబడే వ్యక్తిత్వం కలిగివుండడం మంచిది* అని
అవును.... విలువలు పాటిస్తే విజయాలు సాధించవచ్చు.