రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులలో నైపుణ్య వికాసం గురించి బ్రిడ్జి కోర్సు మే 1 నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలో లో 40 కేంద్రాలలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో నిర్వహించడం జరిగింది.
ఐదో తరగతి చదువుకున్న చిన్నారులకు అవగాహన కల్పించడంతో పాటు విద్య వైపు మరియు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో రెసిడెన్షియల్ గా జీవితాన్ని ప్రారంభించడం మంచి చదువు వైపు ఆకర్షించడానికి నైపుణ్యంతో కూడినటువంటి సిలబస్ తయారు చేయటం, దానిని అమలు చేయటానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ ట్రైనర్స్ రమారమి 800 మందికి పైగా గతనెల గా రేయింబవళ్ళు కష్టపడుతూ తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా రమారమి రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది చిన్నారుల కు నైపుణ్యంతో కూడిన విద్య యందు ఆసక్తి కొత్త జీవితంలోకి అడుగు పెట్టే దిశగా వారిలో నమ్మకం కలుగ చేసి కొన్నివేల చిన్నారి జీవితాలకు మార్గదర్శకం చూపించిన నైపుణ్య సంస్థ స్కిల్ ట్రైనర్ లు అందరికీ సంస్థ తరఫున అభినందనలు.
800 మంది లో ముఖ్యంగా 95 శాతం మహిళ స్కిల్ ట్రైనర్స్ పనిచేశారు. వేసవి సెలవులలో తీవ్రమైన ఎండను లెక్కచేయకుండా , సెలవుల్లో కుటుంబ సభ్యులతో గడపకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చిన్నారులు నైపుణ్య వికాసం గురించి పాటుపడిన అందులకు వీరందరూ ఎంతైనా అభినందనీయులు.