యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆర్టికల్ 370 ని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. జమ్మూ-కాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు ఇస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేయాలనే యోచనలో తెలుస్తుంది. ఈ ఆర్టికల్ ను రద్దు లేదా పునర్ సమీక్షిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు.
ఆర్టికల్ 370..అంటే ఏమిటి ?
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒకే పౌరసౌత్వం వుంటే... జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి.ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జాతీయజెండా కూడా వుంది.దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే...ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశ_సార్వభౌమాధికారాన్ని, జాతీయపతాకాన్ని, జాతీయచిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం...!జమ్మూ&కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది...అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.!దీనిని అలుసుగా చేసుకొని పాకిస్ధాన్ ప్రభుత్వాలు, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు జమ్మూకాశ్మీర్ లోని వేర్పాటువాదుల సహాయంతో పెద్దయెత్తున అక్రమ మార్గాలలో పాక్ ముస్లింయువకులను కాశ్మీర్ లో ప్రవేశపెట్టి, వారికి భారత్ లోని కాశ్మీర్ ముస్లిం యువతులకు నిఖాహ్ లు చేసి, వారికి భారతదేశ పౌరసత్వం ఇప్పిస్తూ, కాశ్మీర్ లో ముస్లిం జనాభా పెంచడం ద్వారా వేర్పాటువాదానికి పునాదులు వేస్తున్నారు..!ఆర్టికల్ 370 ని అడ్డుపెట్టుకొని స్థానిక కాశ్మీర్ ముస్లింలు మరియు పాక్ ముస్లిం చొరబాటుదారులు భారత జవాన్ల మీద ఏవిధంగా రాళ్ళదాడులకు, ఉగ్రవాద దాడులకు తెగబడుతున్నారు.ఆర్టికల్ 370 మూలంగా భారతప్రభుత్వాలు ఆర్టిఐ చట్టాలు ఇక్కడ పనిచేయవు.ఆర్టిఇ ఇక్కడ అప్లై చేయబడదు.కాగ్కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు ఈ రాష్ట్రంలో విలువ లేనందు వలన స్థానిక ముస్లిం యువత, పాక్ ముస్లిం చొరబాటుదారులు కాశ్మీర్ లో గస్తీ కాస్తున్న భారత జవాన్ల మీద విచక్షణారహితంగా రాళ్ళదాడులు చేయడం, పాకిస్థాన్ జెండాలు , ఐఎస్ఐఎస్ జైష్-ఏ-మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, తాలిబాన్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల జెండాలు భారత భూభాగంలో ఎగురవేయడం లాంటి ఉన్మాద చర్యలతో పాటూ ఉగ్రవాదదాడులు చేసి జవాన్లను బలి తీసుకుంటున్నారు...! తాజాగా పుల్వామాలో గస్తీకి వెళ్తున్న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై దొంగదెబ్బ కొట్టి 46మంది భారత జవాన్ల ప్రాణాలను బలిగొనిప్రపంచానికి తమ నపుంసకత్వాన్ని చాటుకున్నారు.జైష్-ఏ-మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ...!ఆర్టికల్ 370 వలన ముస్లిమేతరులు, మిగిలిన భారతీయులు హత్యలకు, అత్యాచారాలకు, వివక్షకు, అన్యాయాలకు గురైనారు.జమ్మూ కాశ్మీర్ మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి. అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు.ఇస్లాం ప్రాబల్యం పెంచుకోవడానికి ఎంతోమంది హిందువులను,సిక్కులను ఊచకోత కోసారు..మతం మారని హిందువులను, సిక్కులను, జైనులను అత్యాచారాలు, హత్యలు చేసి చంపారు.. బలవంతంగా మతమార్పిడి చేసారు... స్థానికులు అయిన కాశ్మీర్ పండితులను కాశ్మీర్ నుండి తరిమికొట్టారు..., వారికి ఇప్పటికీ న్యాయం జరగక ఢిల్లీలో శరణార్ధులుగా బ్రతుకుతున్నారు..!కాశ్మీర్ లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు,) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలుకావాడం లేదు. ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇదంతా గాంధీ,నెహ్రూ,కాంగ్రెస్ పార్టీ పుణ్యమే..