బీజేపీ ఎంసీ సాక్షీ మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. రాక్షస వంశస్థురాలంటూ ఆయన కామెంట్ చేశారు. రాక్షస రాజు అయిన హిరణ్యకశ్యపుడి కుటుంబానికి దీదీ చెంది ఉంటుందని సాక్షీ మహారాజ్ విమర్శించారు. నారాయణ మంత్రం జపించిన తన స్వంత కుమారుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడు జైలులో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తాడు. అలాంటి రాజు లాంటి వ్యక్తే మమతా బెనర్జీ అని సాక్షీ మహారాజ్ ఆరోపించారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్న వారిని దీదీ జైలులో పెడుతోందని ఆయన విమర్శించారు. జై శ్రీరామ్ అన్న వారి పట్ల మమతా బెనర్జీ చికాకులోనవుతోందన్నారు.