అన్ని స్కూళ్లలో హిందీ భాషను మూడవ భాషగా నేర్పాలంటూ మోదీ సర్కార్ తెచ్చిన కొత్త విద్యా నిబంధనపై సర్వత్రా నిరసన వ్యక్తం అయ్యింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడులో భారీ స్థాయిలో వ్యతిరేకవ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తప్పనిసరిగా హిందీ భాష బోధించాలంటూ పెట్టిన నిబంధనను కేంద్రం తొలగించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ హిందీ భాషను నేర్పాలని కేంద్రం భావించింది. కానీ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. మార్పు చేసిన విద్యా విధాన ముసాయిదాను మళ్లీ విడుదల చేశారు. దక్షిణాది రాష్ట్రాలు హిందీ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలన్న నిబంధన ఎత్తేశారు. ప్రఖ్యాత శాస్‌్రివేత్త కే.కస్తూరిరంగన్ ఇచ్చిన నివేదిక ప్రకారం హిందీ భాషను తప్పనిసరిగా చేయాలని భావించారు.