YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఢమాల్ మని పడ్డ శనగ ధర

 ఢమాల్ మని పడ్డ శనగ ధర

శనగల ధర పతనం అంచుల్లో ఉంది. శనగల ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారుధరలు పతనమైన నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సంస్ధ నాఫెడ్‌ నిర్ణయంతో మేలు జరుగుతుందని రైతులు భావించారుజేజీ-11 రకం శనగల ధర క్వింటా ప్రస్తుతం రూ.3600లకు పడిపోయింది. అదే విధంగా కాక్‌-2 రకం ధర రూ.4100లు పలుకుతోంది. ఈ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారులు కరవయ్యారు. పంట చేతికందే సమయంలో కాక్‌-2 ధర 5200లు ఉంది. జేజీ-11 రకం ధర రూ.4200లు ఉంది. గత ఏడాది కాక్‌-2 రకం ధర రికార్డుస్థాయిలో రూ.10 వేలు పలకగా పంట సాగుచేసే సమయంలో  రూ.8500లు పలికింది. అదే విధంగా జేజి-11 రకం ధర క్వింటాలు రూ.5500ల వరకు పలికింది. గతేడాది క్వింటాకు జేజీ-11 రకానికి రూ.2400లు చొప్పున రుణం మంజూరు చేశారు. ప్రస్తుతం ఉన్న ధరకు శనగలు అమ్మినా శీతల గోదాం అద్దె, రుణం, దానిపై వడ్డీ చెల్లించేందుకు సరిపోతాయి. రైతుకు మిగిలేదేమీ ఉండదు. మరికొద్ది రోజులు వేచివుంటే ధర వస్తుందేమోనని రైతులు ఆశగా ఉన్నారు. రైతులు స్పందించకుంటే శనగలు వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని శీతల గిడ్డంగుల్లో సుమారు 6,54 లక్షల క్వింటాళ్ల శనగలు నిల్వ ఉన్నాయి.. అనుమతిచ్చిన మేరకు కొనుగోలు జరగ జరగలేదు. .శనగ పంట శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల నోటీసులతో ఆందోళనకు గురవుతున్నారు. రుణాలు తీసుకున్న వారు నిర్ణీత గడువు ఏడాదిలోపు తిరిగి చెల్లించాలి. ధరలు పతనమవ్వడంతో నిల్వచేసిన వాటిని రైతులు అమ్ముకోలేకపోతున్నారు. ప్రస్తుత ధరకు విక్రయిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. గతేడాది పండించిన శనగ పంట శీతల గిడ్డంగుల్లో నిల్వవుంచి రుణాలు తీసుకున్న రైతులకు గడువు మీరడంతో బ్యాంకులు తాఖీదులు జారీ చేస్తున్నాయి. వెంటనే చెల్లించాలని లేకుంటే వేలం నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. ధరలు తగ్గుతుండడంతో .. వేచివుంటే తాము మంజూరు చేసిన రుణం వసూలుచేసుకోవడం కష్టమవుతుందన్న ఆందోళన బ్యాంకు అధికారులను వెంటాడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గడువు దాటిన రైతులందరికీ నోటీసులు పంపుతున్నారు.జిల్లాలో శనగ సాగు విస్తీర్ణం 81,385 హెక్టార్లు కాగా 2017-18 రబీలో 1,02,646 హెక్టార్లలో సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ జిల్లాలో 60 వేల మెట్రిక్‌ టన్నులు జే.జి.-11 రకం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అనుమతి పొందిన మార్క్‌ఫెడ్‌ జిల్లాలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో 60 వేల మెట్రిక్‌ టన్నులు శనగలు కొనుగోలు చేసేందుకు నాఫెడ్‌ అనుమతిచ్చింది. అయితే 12,321 మంది రైతుల నుంచి 20,348 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు రూ.3500-3600లు మాత్రమే ఉంది. నాఫెడ్‌ క్వింటా రూ.4400లు కొనుగోలు చేయడంతో రైతులకు కొంతమేరకైనా మేలు జరుగుతుందని భావించినా ఫలితం దక్కలేదు.

Related Posts