ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కి ముందే భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో బుధవారం తొలి మ్యాచ్‌లో టీమిండియా తలపడాల్సి ఉండగా.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో.. అక్కడే ఉన్న ఫిజియో ప్రథమ చికిత్స చేసినా.. నొప్పి తగ్గకపోవడంతో ఐస్ వాటర్‌లో గాయమైన వేలుని ఉంచి ప్రాక్టీస్ సెషన్‌ని కోహ్లీ వీడినట్లు తెలుస్తోంది. గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆడనుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడటం చాలా కీలకం. కానీ.. తాజా వేలి గాయంతో అతను మ్యాచ్ ఆడతాడా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. సుదీర్ఘంగా జరగనున్న ప్రపంచకప్‌లో కోహ్లీ గాయంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేయకపోవచ్చు. కానీ.. వేలి గాయమే కావడంతో మ్యాచ్ ఆడకుండా రిజర్వ్ బెంచ్‌పై కూర్చొనేందుకు విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విరాట్ కోహ్లీ మ్యాచ్‌కి దూరమైతే అతని స్థానంలో దినేశ్ కార్తీక్ లేదా విజయ్ శంకర్ ఆడే అవకాశం ఉంది. అప్పుడు మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనుండగా.. టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు