YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సెప్టెంబర్ లో భారత్ కు సఫారీలు

 సెప్టెంబర్ లో భారత్ కు సఫారీలు

భారత్ జట్టు 2019-20 మధ్యకాలంలో సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌ 2019లో ఆడేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లిన టీమిండియా.. ఈ టోర్నీ తర్వాత భారత్‌ వేదికగా 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు సెప్టెంబరు 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 18 వరకూ భారత్ జట్టు సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ ఈరోజు ప్రకటించింది.
లార్డ్స్‌ వేదికగా జూలై 14న ఫైనల్‌తో ప్రపంచకప్ ముగియనుండగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనకి రానుంది. ఫ్రీడమ్ సిరీస్‌ పేరుతో సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఈ సిరీస్‌లో మూడు టీ20లు, మూడు టెస్టులని అక్టోబరు 13 వరకూ టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్‌కి రానుండగా.. నవంబరు 3 నుంచి.. 26 వరకూ మూడు టీ20లు, రెండు టెస్టులని టీమిండియా ఆడనుంది. అనంతరం వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియా.. మళ్లీ వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా భారత్‌కి రానుంది.

Related Posts