యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నూజివీడు ట్రిపుల్ ఐటీలో లో 300 మంది పైగా ఇంజనీరింగ్ ట్రైనర్స్ కు అడ్వాన్సు ఇంజినీరింగ్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వటానికి ప్రారంభోత్సవం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ JSV ప్రసాద్ గారు మరియు శ్రీమతి దమయంతి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్, శ్రీ రామ రాజు గారు వైస్ ఛాన్స్లర్ గారి ఆధ్వర్యంలో జరిగినది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నైపుణ్య సంస్థ ఇంజనీరింగ్ స్కిల్ ట్రైనర్స్ ఈ శిక్షణతో కమ్యూనికేషన్ స్కిల్స్ లో , లైఫ్ స్కిల్స్ లో అలాగే అదనంగా రెండు డొమైన్ స్కిల్స్లో ఈ నెలలో లో శిక్షణ పొందుతారు. వీరందరూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు అదేవిధంగా విద్యార్థులకు కూడా ప్రతి ఒక్క ట్రైనర్ మూడు డొమైన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వటానికి తయారు అవుతారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మొట్టమొదట మొదలుపెట్టిన ఈ నెలరోజులు శిక్షణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నైపుణ్య సంస్థ ఇంజనీరింగ్ ట్రైనర్స్ వేలాది మంది విద్యార్థులకు వారి రెగ్యులర్ సిలబస్ తో పాటు 3 డొమైన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారు రాబోయే కాలంలో...తద్వారా BTech డిగ్రీ పూర్తి అయిన వెంటనే విద్యార్థులకు ఈ డొమైన్ స్కిల్స్ వలన మరిన్ని మంచి ఉద్యోగావకాశాలు కలుగుతాయి.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 సీఎం సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ లను స్కిల్ సెంటర్స్ గా అనేక కోర్సుల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు