యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీ ఎంసెట్-2019 ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం (జూన్ 4) ఉదయం 11.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. ఆయా వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను అధికారులు కేటాయించారు.
ఫలితాలను కింది వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు.. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,95,908 మంది; అగ్రికల్చర్, మెడికల్ విభాగాల నుంచి 86,910 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 1,85,711 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలకు 81,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి దాదాపు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రాథమిక కీని ఏప్రిల్ 24న; అగ్రికల్చర్, మెడికల్ ప్రాథమిక కీని ఏప్రిల్ 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీతో పాటు ఎంసెట్ ఫలితాలను కూడా జూన్ 4న వెల్లడించనున్నారు.