YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎస్ ఎం ఎస్ తో ఎల్ ఐసీ అప్ డేట్స్

ఎస్ ఎం ఎస్ తో ఎల్ ఐసీ అప్ డేట్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కస్టమర్లు వారి పాలసీలకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా సులభంగానే తెలుసుకోవచ్చు. ఎల్‌ఐసీ బ్రాంచులకు వెళ్లకుండానే ఆన్‌లైన్ పాలసీ వివరాలు పొందొచ్చు. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాలసీ స్టేట్‌మెంట్ పొందొచ్చు. ఇందులో పాలసీ మెచ్యూరిటీ, చెల్లించిన ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్ వంటి వివరాలు ఉంటాయి. మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవాలంటే.. ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగం కింద కస్టమర్ పోర్టల్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ యూజర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరు, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఎల్ఐసీ అకౌంట్‌ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా పాలసీ వివరాలు చూసుకోవచ్చు. అలాగే 02268276827 కాల్ చేసి కూడా పాలసీ వివరాలు పొందొచ్చు. ఎల్ఐసీహెచ్ఈఎల్‌పీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పాలసీ నెంబర్ ఎంటర్ చేసి 9222492224కు ఎస్ఎంఎస్ పంపినా కూడా పాలసీ సేవలు లభిస్తాయి. ఎల్ఐసీ కస్టమర్లు అందరికీ ఈ సేవలు ఉచితం. పాలసీ ప్రీమియం కోసం మొబైల్ నెంబర్ నుంచి ఆస్క్ఎల్ఐసీ ప్రీమియం అని టైప్ చేసి 56677కు ఎస్ఎంఎస్ పంపండి. ఒకవేళ మీ పాలసీ ల్యాప్స్ అయ్యి ఉంటే ఆస్క్ఎల్ఐసీ రివివల్ అని టైప్ చేసి 56677కు ఎస్ఎంఎస్ సెండ్ చేయండి. అదే బోనస్ వివరాల కోసం ఆస్క్ఎల్ఐసీ బోనస్ అని టైప్ చేసి పై నెంబర్‌కే ఎస్ఎంఎస్ పంపండి. పాలసీ నామిని వివరాల కోసం ఆస్క్ఎల్ఐసీ ఎన్ఓఎం అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

Related Posts