YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను ముద్దాడిన స్వరూపానంద

జగన్ ను ముద్దాడిన స్వరూపానంద

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జగన్‌కు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌‌కు శారద పీఠంలోని వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు కానుకలు సమర్పించిన జగన్, పాదాభివందనం చేశారు. ఈ సమయంలో జగన్‌ను స్వరూపానందేంద్ర స్వామి ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా ముద్దాడారు. తర్వాత రాజశ్యామల దేవికి జగన్ పూజలు నిర్వహించనున్నారు. క్యాబినెట్ ముహూర్తం, మంత్రుల పేర్ల విషయమై స్వామితో సీఎం చర్చించినున్నట్టు తెలుస్తోంది. ఇక, విశాఖ నుంచి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసులను మోహరించారు. జగన్‌కు దారిపొడువునా అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ తొలిసారి విశాఖ పర్యటనకు రావడంతో ఎయిర్‌పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా సీఎం రాకకు ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Related Posts