YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

10న ఏపీ తొలి కేబినెట్ 12 నుంచి అసెంబ్లీ

10న ఏపీ తొలి కేబినెట్ 12 నుంచి అసెంబ్లీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ పాలనపై ఫోకస్ పెట్టారు. శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనతో పాటూ కేబినెట్ విస్తరణ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కసరత్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అలాగే సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ పూర్తి చేసి.. ఈ నెల 10న తొలి భేటీ నిర్వహించోతున్నారట. అసెంబ్లీ సమావేశాలు తొలుత గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. అనంతరం ప్రొటెం స్పీకర్ ఎన్నిక.. సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. చీఫ్ విప్, విప్‌ల పదవుల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించారు అధికారులు. ఇటు జగన్ ఈ నెల 7 నుంచి సచివాలయానికి వెళ్లబోతున్నారట. అదే రోజు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించబోతున్నారట.. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్‌ ఎంపికపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రేసులో వైసీపీకి చెందిన సీనియర్లు, ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా.. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి.. శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి జగన్ స్పీకర్‌గా ఎవరికి అవకాశం కల్పిస్తారో చూడాలి.

Related Posts