YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఇఫ్తార్ ఖర్చు 1. 8 కోట్లు

ఏపీలో ఇఫ్తార్ ఖర్చు 1. 8 కోట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 6 వేల మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా.. భోజనాలు, ఏసీ బిల్లు, ఇతర ఖర్చులన్నీ కలుపుకొని ప్రభుత్వం రూ.1.8 కోట్లను చెల్లించింది. ఈ విషయమై టీడీపీ సానుభూతిపరులు స్పందిస్తూ.. 15 వేల మందికి భోజనాలతో కలుపుకొని సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి రూ.29 లక్షలే ఖర్చు పెట్టారు. అలాంటిది 6 వేల మందికి ఇఫ్తార్ విందు ఖర్చు కోటి రూపాయలు దాటిందెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇఫ్తార్ విందును, సాధారణ భోజనాలతో పోల్చలేమని తెలిసినా.. వారిలా ప్రశ్నించడంతో.. వైఎస్ఆర్సీపీ అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నలుగురి డ్రై ఫ్రూట్స్ ఖర్చు 18 లక్షలా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం మూడేళ్లలో రూ.18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారం మీడియాలో

రావడంతో.. జగన్ ఫ్యాన్స్ బాబు పాలనను విమర్శిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు.

Related Posts