తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కుటుంభ సభ్యులతో కలిసి ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు సాధారణ భక్తునిగా వైకుంఠ ద్వారం నుండి ఆలయానికి చేరుకున్నారు ఉపరాష్ట్రపతి. మహాద్వారం దగ్గర టి.టి.డి అధికారులు, అర్చకులు ఇస్థికఫిల్ స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేదపఞమడితులు వేధ ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు అధికారులు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలన్నారు. యధ్భావం తద్భవతి, దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. వర్షాలు బాగా కురవాలని, ప్రకృతి వైప రీత్యాలు లేకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలని, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు.
తాను రాజకీయాల్లో లేనని, భవిష్యత్తు లో నూ ఇక ఆలోచన లేదన్నారు వెంకయ్యనాయుడు. దేశానికి సేవ చేసుకునే శక్తి ని నాకు ఇవ్వమని శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉంటున్నట్లు తెలిపారు. దైవ దర్శనం, సాహిత్యం, సత్సంగం తో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.