యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు కృషిచేయా లని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్, స్థానిక శాసనసభ్యులు హాఫీజ్ ఖాన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని
రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ సుధాకర్, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ వేరువేరుగా మాట్లాడుతూ పేర్కొన్నారు .మంగళవారం కర్నూలు సర్వజన ప్రధాన ఆసుపత్రిలో సుమారు రూ 1.5 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన న్యూరాలజీ, ఆర్తో ,న్యూరో మాడ్యులర్ ఓటి లను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరంధన్వంతరి సమావేశ భవనంలో వక్తలు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించుటకు వైద్య సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. కర్నూలు ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించుటకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రాయలసీమ లోనే గాక తెలంగాణ జిల్లాల నుండి కూడా అనునిత్యం వైద్య సేవల కోసం ప్రజలు వస్తుంటారని అందువల్ల రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు .ముఖ్యంగా వైద్య వృత్తిలో సేవలందిస్తున్న ఉద్యోగుల సేవలు ఎనలేనివని అన్నారు.ఆసుపత్రి అభివృద్ధి కి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆధునిక పరికరాలు ఏర్పాటు ,సిబ్బంది కొరత తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులుగా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామన్నారు. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారి జీతభత్యాల మంజూరు కొరకు చర్యలు చేపడతామన్నారు.సెక్యురిటి ఏజెన్సీలో పలు సరిదిద్దుకోవాలన్నారు.