జగన్ మోహన్ రెడ్డి నేడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ పెట్టేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆయన ఆదేశించారని సమాచారం. ప్రభుత్వం మారినా, గత ప్రభుత్వం నియమించిన పాలకమండళ్లు రాజీనామా చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్న జగన్, ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.