YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

11 ఏళ్లలో రెండు లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

11 ఏళ్లలో రెండు లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
 

బ్యాంకుల్లో మోసాలు విపరీతంగా పెరుగుతున్నట్టు ఆర్‌‌బీఐ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో 6,800 మోసాలు జరగడంతో రూ.71,500 కోట్ల నష్టం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఇది వెల్లడించింది. అయితే అంతకుముందు ఏడాది, అంటే 2017–18 ఆర్థిక సంవత్సరంలో 5,916 కేసులు నమోదు కావడంతో బ్యాంకులు రూ.41,167 కోట్లు నష్టపోయాయి. 2017 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 73 శాతం పెరిగింది. గత 11 ఏళ్లలో బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో మోసాలపై 53,334 కేసులు నమోదయ్యాయి. రూ.2.05 లక్షల కోట్లను పోగొట్టుకున్నాయి.2008–09లో బ్యాంకులు రూ.1,860 కోట్లు పోగొట్టుకోవడంతో 4,372 కేసులు దాఖలయ్యాయి. 2009–10లో రూ.1,998 కోట్ల నిధులు గోల్‌‌మాల్‌‌ కాగా, 4,669 కేసులు నమోదయ్యాయి. 2010–11లో 4,534 కేసులు ఉండగా, బ్యాంకులు రూ.3,815 కోట్లు కోల్పోయాయి. మరుసటి ఆర్థిక సంవత్సరంలో 4,093 కేసులు రాగా, రూ.4,501 కోట్ల నష్టం జరిగింది. 2012 ఆర్థిక సంవత్సరంలో 4,235 కేసులు దాఖలు కాగా, రూ.8590 కోట్ల నష్టం వాటిల్లింది. మరుసటి ఏడాది 4,306 కేసులను నమోదు చేయగా, రూ.10,170 కోట్ల నష్టం జరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.19,455 కోట్లు పోగొట్టుకోగా, 4,639 కేసులు పెట్టారు. 2015–16లో మొత్తం 4,693 కేసులు రాగా, రూ.18,698 కోట్ల మోసం జరిగింది. 2016–17లో 5,076 కేసులు నమోదవగా, రూ.23,933 కోట్ల నష్టం వచ్చిందని ఆర్‌‌బీఐ వివరించింది.బ్యాంకుల్లో మోసాలు జరిగినప్పుడు అధికారులు క్రిమినల్‌‌ కంప్లయింట్లు ఇవ్వాలని, తదనంతరం ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని ఆర్‌‌బీఐ పేర్కొంది. ఈ కేసుల్లో తీసుకుంటున్న, తీసుకున్న చర్యల గురించి మాత్రం సమాచారం లేదని స్పష్టం చేసింది. నేరం జరిగిన పద్ధతి, నష్టపోయిన మొత్తం, రుణజారీ విధానం, మోసానికి ఊతమిచ్చిన పరిస్థితులు, లోపాలను పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి విశ్లేషిస్తున్నట్టు ఆర్‌‌బీఐ తెలిపింది. ఈ మోసాలపై అధ్యయనం తరువాత వీటిని 13 రకాలుగా విభజించారు.ఆభరణాలు, పరిశ్రమ, వ్యవసాయం, మీడియా, ఏవియేషన్‌‌, సర్వీస్‌‌, ప్రాజెక్టు, డిస్కౌంటింగ్‌‌ ఆఫ్‌‌ చెక్స్‌‌, ట్రేడింగ్‌‌, ఐటీ, ఎక్స్‌‌పోర్ట్‌‌ బిజినెస్‌‌, ఎఫ్‌‌డీలు, డిమాండ్‌‌ లోన్‌‌ ఇందులో ముఖ్యమైనవి. బ్యాంక్‌‌ మోసాలను   నివారించడానికి ప్రామాణిక నిర్వహణ పద్ధతులను, పరిశీలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీవీసీ సూచించింది. ఐడీబీఐని రూ.600 కోట్లకు మోసగించిన కేసులో సీబీఐ గత ఏడాది ఆ బ్యాంకు సీఎండీ, ఎయిర్‌‌సెల్‌‌ మాజీ ప్రమోటర్‌‌ శివశంకరన్‌‌, ఆయన కొడుకు, వీళ్ల కంపెనీలపై కేసులు నమోదు చేసింది. 15 మంది బ్యాంకు సీనియర్‌‌ అధికారులనూ నిందితులుగా చేర్చింది. శివశంకరన్‌‌ కంపెనీలకు వీరు అక్రమంగా అప్పులు ఇచ్చినట్టు సీవీసీ తన ఫిర్యాదులో పేర్కొంది. బ్యాంకుల్లో జరిగే భారీ కుంభకోణాలపై సీబీఐతోపాటు ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి.

Related Posts