YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేశినేని నాని అలక వెనుక...

 కేశినేని నాని అలక వెనుక...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు… కేశినేని నాని.. ఆ పార్టీకి దూరంగా జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడలో టీడీపీ అధినేత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినప్పటికీ.. ఆయన హాజరు కాలేదు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమం.. దగ్గరుండి చూసుకోవాల్సిన కేశినేని నాని.. ఏ పని లేకపోయినా.. ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఉండిపోయారు.  విజయవాడ ఎంపీగా అతి కష్టం మీద గెలిచిన కేశినేని నాని.. తనకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయినట్లుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల తరపున టీడీపీపీ అధ్యక్షునిగా గల్లా జయదేవ్‌కు చంద్రబాబు బాధ్యతలు ఇచ్చారు. లోక్‌సభా పక్ష నేతగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. పార్టీ తరపున గెలిచిన ముగ్గురిలో ఇద్దరికి పార్లమెంటరీ పదవులు ఇచ్చి.. తనకు మాత్రం.. ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. కేశినేని నాని అసంతృప్తికి గురయినట్లు చెబుతున్నారు. అప్పట్నుంచి ఆయన… టీడీపీకి దూరంగా ఉన్నారంటున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారు..? మరో వైపు.. కేశినేని నాని.. హుటాహుటిన…ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులకే.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లి… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. గెలిచినందుకు అభినందనలు తెలిపి.. తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిజానికి అప్పటికి గడ్కరీకి.. కేంద్ర మంత్రి పదవి వస్తుందో … లేదో క్లారిటీ లేదు. ఒక వేళ సీనియర్‌గా కచ్చితంగా వస్తుందని నిర్ణయించుకున్నా.. ఏ శాఖ ఇస్తారో … మోడీ, అమిత్ షాలు ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ.. కేశినేని నాని నాగపూర్ వెళ్లి … గడ్కరీని కలిసి.. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయడం టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తం అయింది. తెలుగుదేశం పార్టీ నేతల మీద బీజేపీ గురి పెట్టిందని… ప్రచారం జరుగుతున్న సమయంలో… కేశినేని నాని.. అలక కచ్చితంగా అనుమానించదగ్గదే. గెలిచిన రెండు, మూడు రోజులకే.. ఆయన బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులకు వెళ్లడం … కచ్చితంగా ఊహాగానాలకు తావిచ్చేదే. మరి ఈ విషయంలో కేశినేని నాని ఎలాంటి స్పందన వ్యక్తం చేసినా.. ఉద్దేశపూర్వకంగానే.. ఇలాంటి ఊహాగానాలు రావడానికి మాత్రం ఆయన వ్యవహారశైలే కారణం. 

Related Posts