YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి

 ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి

రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ ఏ పార్టీ బలం లేకుండానే సొంతంగా కేంద్రంలో నిలబడ్డారు. ఇప్పుడు ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత మోడీ తన తొలి పర్యటనగా ఆంధ్రప్రదేశ్‌‌కి వస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మోజార్టీతో గెలిచింది. మరో సారి ప్రధాని మోడీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీంతో నరేంద్ర మోడీ తొలి పర్యటనలో ఏపీకి ఏమైనా వరాలిస్తాడా? ప్రత్యేక హోదాపై ఏమైనా ప్రకటన చేస్తాడా అని ప్రజలు, పార్టీలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత 2014లో టీడీపీతో జతకట్టిన నరేంద్ర మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పిన విషయం తెలిసిందే. మరి రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన మోడీ ఇప్పుడైనా ఏపికి ప్రత్యేక హోదాపై గతంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తాడా? లేదా అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఏపీలో తనకు అనకూలమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, నారా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం... ఇటు ఏపీకి న్యాయం చేస్తానని ట్వీట్ చేయడంతో తన వరాల మూటను మోడీ విప్పుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇటివలే ప్రత్యేక హోదా డిమాండ్ తోనే ప్రధాని మోడీని కలిశారు వైఎస్ జగన్. మోడీని 30 సార్లు కలిసినా తాను మొదట కోరేది ప్రత్యేకహోదానేనని స్పష్టం చేశారు. చివరి వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. మరీ ఏపీ ప్రభుత్వం ఎంత పోరాడుతున్నా, మోడీ కొంచమైనా కరుగుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 9న తిరుపతికి వస్తున్న ప్రధాని మోడీ ఏపీకి ఏమైనా వరాలు కురిపిస్తాడా? ఏపీ సీఎం జగన్ గెలవగానే ఏపీని ఆదుకుంటానని ప్రకటన చేసిన మోడీ ఆ పని నెరవేరుస్తాడా? తిరుమల వెంకన్న సాక్షిగా వరాలు కురిపిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరీ ఈనెల 9న ఏపీ ప్రజలకు తీపికబురు చెప్తారో లేదో అన్నది వేచిచూడాలి.

Related Posts