వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు నీలం రంగు అంటే ఇష్టం. అనేక సార్లు వివిధసమస్యపై ఉద్యమం నిర్వహించినప్పుడు కాని, దీక్షలు చేసినప్పుడు కాని ఎక్కువగా బ్లూ షర్ట్ లను మాత్రమే ధరించారు. బ్లూ అంటే జగన్ కు ఇష్టమని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతుంటారు. పాదయాత్ర ముందు వరకూ పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో గాని బయట గాని, మీడియా సమావేశాలకు కూడా జగన్ బ్లూ షర్ట్ తో హాజరయ్యేవారు.ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయిన తర్వాత ఆయన తన డ్రెస్ కోడ్ ను పూర్తిగా మార్చివేసుకున్నారు. ఇష్టమైన బ్లూరంగు ను వదిలేసినట్లు కన్పిస్తోంది. పాదయాత్ర సమయంలో పూర్తిగా జగన్ తెలుపు రంగు చొక్కా, ఖాకీరంగు ప్యాంట్ ను ధరిస్తూ వచ్చారు. పాదయాత్ర తర్వాత కూడా జగన్ అదే డ్రస్ ను కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ, ఆ తర్వాత అధికారులతో చేసే సమీక్షల్లోనూ జగన్ వైట్ షర్ట్ తోనే కన్పిస్తున్నారు. జగన్ ఇక పూర్తిగా తెలుపురంగుతోనే స్వచ్ఛంగా కన్పిస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర తర్వాత తన డ్రెస్ కోడ్ ను పూర్తిగా మార్చివేసిందంటున్నారు.