YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్టీల మధ్య కుదరని సయోధ్య

పార్టీల మధ్య కుదరని సయోధ్య

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చినా కాక చల్లారలేదు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీలు పైకి ఒక్కటిగా కన్పిస్తున్నప్పటికీ లోలోపల ఒకరినొకరు ఓడించేందుకు కుట్రలు చేసుకున్నాయని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఓడించారని జనతాదళ్ ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు తమను మానసికంగా దెబ్బతీసేందుకు గెలుపుబాట పట్టకుండా అడ్డుకున్నారని 
జనతాదళ్ ఎస్ తమ సమీక్షల్లో తేల్చింది. మాండ్య, తుముకూరు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ క్యాడర్ తో పాటు నేతలు కూడా తమకు సహకరించలేదన్నది జనతాదళ్ ఎస్ ఆరోపణ.మాండ్యలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ స్వతంత్ర అభ్యర్థి చేతిలో దారుణ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా సుమలతకు మద్దతు తెలిపినా అరకొర చర్యలు తప్ప ఎలాంటి యాక్షన్ కు కాంగ్రెస్ పార్టీ దిగలేదని జనతాదళ్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావులు సయితం ఇక్కడ క్యాడర్ ను అదుపు చేసే ప్రయత్నం చేయలేదంటున్నారు.ఇక తుముకూరు విషయానికొస్తే జనతాదళ్ ఎస్ కంటే కాంగ్రెస్ నుంచే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమికి కారణం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.ఎన్. రాజన్ అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బసవరాజుకు కాంగ్రెస్ నేతలు సహకరించారని పక్కా ఆధారాలున్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు 
తమ పార్టీకి బదిలీ జరగలేదని జనతాదళ్ ఎస్ స్పష్టంగా లెక్కలతో సహా చెబుతోంది. 28 లోక్ సభ స్థానాల్లో జేడీఎస్, కాంగ్రెస్ చెరొక స్థానంలోనే గెలిచాయి.అయితే కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో జేడీఎస్ కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే తుముకూరు, మాండ్యలో ఓటమికి గల కారణాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కుమారస్వామి తెలిపారు. అయితే తొందరపడవద్దని దీనిపై తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని రాహుల్ గాంధీ కుమారస్వామికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దేవెగౌడ సయితం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎప్పుడు కుమారస్వామి కాంగ్రెస్ కు బై బై చెబుతారో? అన్న ప్రచారం కన్నడనాట జరుగుతోంది.

Related Posts