YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నీట్‌ ఫలితాలు విడుదల

నీట్‌ ఫలితాలు విడుదల

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 
 

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్‌ ఎలిజబిలిటి కం ఎంట్రస్‌ టెస్ట్‌(నీట్‌) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నేడు విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్వాల్‌ అనే విద్యార్థి జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించాడు. 720 మార్కులకు గాను నలిన్‌ 701 మార్కులు సాధించాడు. 700 మార్కులతో ఢిల్లీకి చెందిన బవిక్‌ బన్సల్‌ ద్వితీయ 
స్థానంలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్షత్‌ కౌశిక్‌ తృతీయ స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన జి. మాధురి రెడ్డి 695 మార్కులు సాధించి బాలికల్లో ప్రథమ స్థానంలో మొత్తంగా జాతీయ స్థాయిలో ఏడవస్థానంలో నిలిచింది. మొత్తం 15,19,375 మంది విద్యార్థులు నీట్‌కు రిజిస్టర్‌ చేసుకోగా 14,10,755 మంది విద్యార్థులు పరీక్షకు హాజయ్యారు. వీరిలో 7,97,042 
మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Related Posts