యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోప్రజల అందుబాటులో ఉంటూ 24గంటల వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు వేల నుండి 10000 ఒకేసారి జీతాలు పెంచినట్లు ప్రకటించడంతో కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాల వివిధ మండలాల్లో ఆశా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉండే వారిని ఆశా కార్యకర్తలు గా సెకండ్ ఏఎన్ఎం లుగా నియమించారు గతంలో ఆశ వర్కర్లకు రూ 500 సెకండ్ ఏఎన్ఎం నాకు నాలుగు వేలు జీతం ఇచ్చారు అయితే ప్రస్తుతం ఆశ కార్యకర్తలకు రూ 10000 ఒకేసారి పెంచుతున్నట్లు ప్రకటించడంతో వారి ఆనందానికి హద్దులే లేకపోయింది ప్రస్తుతం ఆశ వర్కర్లు కార్యకర్తలు గ్రామాలలో మాతా శిశు సంరక్షణకోసం వారు కృషి చేయనున్నారు గర్భిణీలకు నెల నెల గా ఆస్పత్రులకు తీసుకొచ్చి వైద్యుల చేత చికిత్స చేయించి కాన్పు అయ్యేంతవరకు చూసుకునే బాధ్యత ఆశ వర్కర్ల ది మండలాలు ,గ్రామాల్లో ఆశ వర్కర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో తాము కలిశామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు తమకు జీతాలు పెంచడం జరిగిందని వారు హర్షం వ్యక్తం చేశారు