యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్‌కు అదిరే ఆరంభం. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కోహ్లీసేన బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. చాహల్ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్ (2/44) ధాటికి మొదట దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. మోరిస్ (42; 34 బంతుల్లో 1×4, 2×6), రబాడ (31 నాటౌట్; 35 బంతుల్లో 2×4)ల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం ఆ జట్టుకు కాస్త పోరాడే స్కోరును అందించింది. రోహిత్ శర్మ (122 నాటౌట్; 144 బంతుల్లో 13×4, 2×6) సూపర్ శతకానికి ధోని (34; 46 బంతుల్లో 2×4), రాహుల్ (26; 42 బంతుల్లో 2×4)ల కీలక ఇన్నింగ్స్ తోడవడంతో లక్ష్యాన్ని భారత్... 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.