యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నైపుణ్యాభివృద్ధి సంస్థ, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో రాష్ట్రంలో శ్రీకాకుళం, నాగాయలంక, నెల్లూరు సముద్రతీర ప్రాంతాలలో సముద్రపు నాచు ఉత్పత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వటానికి ప్రణాళిక రచించింది. రాబోవు కాలంలో ఈ సముద్రపు నాచు నుండే అనేకరకాలైన ఆహార ఉత్పత్తులు, ఇండస్ట్రీలో ఉత్పత్తులు, చేపల కు మేత, వ్యవసాయానికి సేంద్రియ ఎరువు, మానవుల ఆరోగ్యానికి కావలసిన మెడికల్ మినరల్స్ ఇందులో దొరుకుతాయి. 21 సెంచరీ లో సముద్రపు నాచు కు మరింత ప్రాచుర్యం రానున్నది . దానికి అనుగుణంగా గుజరాత్ లో అనేక రకాలైన పద్ధతులు తీసుకురావడం జరిగింది. అగర్, కార్నగీనం మరియు అలగాలిట్ అనే సి వీడు రకాలు ప్రాచుర్యంలో ఉన్నది. ముందుగా ఆక్వా యువ రైతులకు అవగాహన కలిగించడానికి, నాగాయలంక ప్రాంతం నుంచి కొంతమందిని బాపట్ల లోని సూర్య లంక ప్రాంతం కు తీసుకుని వెళ్లి సముద్రపు నాచు పెంపకం లోని మెళుకువులను, వీటి ఉపయోగాలను, ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. రాబోవు కాలంలో సముద్రపు నాచు నుంచి సంపద సృష్టించే విధంగా నైపుణ్యం మరియు ఉత్పత్తి కేంద్రాలుగా శ్రీకాకుళం నాగాయలంక మరియు నెల్లూరు లను CMFRI ద్వారా ఎంపిక చేయటం, తదనుగుణంగా ముందు అడుగు వేయడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయత్నం చేస్తోంది.