YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిపుర సీఎం  విప్లవ్ కుమార్..?

త్రిపుర సీఎం  విప్లవ్ కుమార్..?

త్రిపురలో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి అన్వేషణలో పడింది. సీపీఎం కంచుకోటను బద్దలు కొట్టి త్రిపురలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. రెండున్నర దశాబ్దాల పాటు సాగిన మాణిక్ సర్కార్ అప్రతిహత నాయకత్వం ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి మారబోతోంది. ఈ నేపథ్యంలో త్రిపుర కొత్త సీఎంగా బీజేపీ ఎవరిని నియమించబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలను విప్లవ్ కుమార్(48)కు అప్పగించనున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.

2016 జనవరి 7 నుంచి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ ఆర్ఎస్ఎస్ వాలంటీర్ అయిన విప్లవ్.. గతంలో ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గానూ పనిచేశారు. బిప్లవ్ స్వస్థలం త్రిపురలోని గోమోటి. స్కూలింగ్ త్రిపురలోనే పూర్తి చేసుకున్న విప్లవ్.. ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పదిహేనేళ్ల క్రితం ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ఆర్ఎస్ఎస్ వాలంటీర్ గా చేరారు. గత ఏడాది అగస్టు 8 న   త్రిపుర కాంగ్రెస్ కీలక నేత సుదీప్ రాయ్ బర్మాన్ ను బీజేపీలోకి తీసుకురావడంలో విప్లవ్ కీలక పాత్ర పోషించారు.  తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించడంలో విప్లవ్ కీలక పాత్ర పోషించారు. కాగా, తాజా ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఏడవ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను అమలు చేస్తామని ఆయన  హామి ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనపై  కూడా విప్లవ్ హామీ  ఇచ్చారు.

Related Posts