యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ టీడీపీ, వైసీపీలు కోరుతున్నాయి. ప్రజావేదికను తమకు కేటాయిస్తే అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకుంటామంటూ చంద్రబాబు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం
ఎంటరయ్యారు.పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోరారు. దీనిని తమకు కేటాయిస్తే పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించే సమావేశాలకు జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారని, ఆయన భద్రతకు, ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన వివరించారు.కాబట్టి ప్రజావేదికను తమకే కేటాయించాలని సీఎస్ ను కోరారు. ప్రజావేదికను తమకంటే తమకు కేటాయించాలంటూ ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ కోరుతుండడంతో సీఎస్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.వైసీపీ విధానాలు తెలుసు, ఆ పార్టీ డిమాండ్లూ బాగా తెలుసు. అన్నింటికీ మించి జగన్ మనస్తత్వం కూడా ఇంకా బాగా తెలుసు. ఇన్ని తెలిసి కూడా టీడీపీ ఓ రాయి వేసింది. నిజానికి అది జరుగుతుందని టీడీపీకీ నమ్మకంలేదు. జరిగితే మంచిది.జరగకపోతే మరీ మంచిది. ఇది పక్కా రాజకీయ వ్యూహం. అందుకే ఇపుడు తొలి బాణం అలా సంధించారు.ఏపీలో కృష్ణానది పరివాహిక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని గగ్గోలు పెట్టిందే వైసీపీ, ఏకంగా ఓ అక్రమ నిర్మాణం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసమని రోజుకు పదిసార్లు వైసీపీ కీలకనేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ కూత పెట్టేది. ఇక జగన్ అసెంబ్లీ లోపలా బయటా కూడా చంద్రబాబు నివాసం అక్రమాల పుట్ట అంటూ గొంతు చించుకున్న సంగతి తెలిసిందే నిజానికి ఒక సీఎం మాజీ అయితే ఆ అధికార నివాసం కచ్చితంగా కొత్త సీఎం కి కేటాయిస్తారు. జగన్ ఏపీ సీఎం కాకముందే తాను అక్రమ కట్టడంలో నివాసం ఉండదలచుకోలేదు కాబట్టే ముందు జాగ్రత్తగా తాడేపల్లిలో అద్భుతమైన నివాసాన్ని కట్టుకున్నారు. మరి జగన్ ఆ భవనం ఎందుకు వదిలేశారు అంటే అక్రమ కట్టడం కాబట్టి కూల్చేయడానికేనని అంతా అనుకుంటున్న వేళ…ఇపుడు పనిగట్టుకుని టీడీపీ ఆ అక్రమం సక్రమమని జగన్ సర్కారే చెప్పాలని అంటోంది. ఇందుకోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకంగా జగన్ కి లేఖను ఈ రోజు రాశారు. తాను ఉంటున్న నివాసం పక్కన ప్రజా వేదికను నిర్మించామని, దాన్ని తన నివాసంగా గుర్తించమని అందులో కోరారు. మరి జగన్ దీన్ని అంగీకరిస్తారా. కచ్చితంగా నో అంటారు. అదే ఇపుడు టీడీపీకి కావాల్సింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, సీనియర్ పొలిటీషియన్ కోరి లేఖ రాస్తే పట్టించుకోకుండా ఆ భవనాన్ని లేకుండా చేశారని నానా యాగీ చేయడానికి ముందస్తు స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మరి జగన్ ఈ విషయంలో ఏం చేస్తారు, రాజకీయ లేఖాస్త్రాన్ని ఎలా తిప్పికొడతారు, ఇది ఇపుడు ఇంటెరెస్టింగ్ పాయింటే మరి. చూడాలి