YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ద్వారాలు మూసే ఉన్నాయి...

వైసీపీ ద్వారాలు మూసే ఉన్నాయి...

టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పదేళ్ళ పాటు పోరాడిన జగన్ ఇపుడు కూడా అదే రూట్లో వెళ్తున్నారు. ఇందులో మరో ప్రశ్నే లేదు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవని, రాష్ట్ర ప్రజలకు తాను బద్దుడనని, ఖజానాకు ధర్మకర్తనని జగన్ పదే పదే చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా గా ఆయన పరిశీలనలోకి వచ్చిన ప్రతి విషయం మీద పూర్తి విచారణకు ఆదేశించాలనుకుంటున్నారు. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరినీ వైసీపీలోకి తీసుకోరాదని జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఈ మేరకు ఆయన పార్టీ సీనియర్లు, ఇతన
నాయకులతో మాట్లాడినపుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారట. ప్రజలు మనకు అవసరమైన దాని కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. పూర్తిగా ఏకపక్షం గెలిపించారు. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు చేయడం ద్వారా చెడ్డ పేరు తప్ప మరేం రాదని జగన్ భావనగా ఉందంటున్నారు.తన వద్దకు వచ్చే నాయకులు ఫలానా టీడీపీ ఎమ్మెల్యే జాయిన్ అవుతానని అంటున్నాడని చెప్పినపుడు జగన్ సున్నితంగా వద్దు అంటున్నారట. ఇలాంటి పనులు చేసే టీడీపీ ఈ రోజు ఈ గతి పట్టించుకుంది. అపుడు మనం బాధితులం, ఇపుడు మనకు అధికారం వచ్చింది కదా అని ఎడా పెడా చేర్చేసుకుంటే ఒరిగేది లేదు కదా టీడీపీ లాగానే రివర్స్ అవుతుందని జగన్ పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం. ఒకవేళ ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారాలనుకుంటే ముందుగా పార్టీకి, ఆ పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. ఉప ఎన్నికలకు సిధ్ధపడాల్సిందే. పూర్తిగా ఆయన సొంత రిస్క్ మీదనే ఫిరాయింపు ఆధారపడి ఉంటుందని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది.అయినా ఇపుడు మనకు ఏపీలో మంచి బలం ఉంది. మన వళ్ళే అన్ని చోట్లా ఉన్నారు. అధికార ఫలాలు కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే దక్కాలి. ఈ కారణంగా ఎవరూ ఎమ్మెల్యేలనే కాదు, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడిని కూడా వైసీపీలోకి చేర్చుకోవద్దు అని జగన్ కచ్చితమైన ఆడేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ కఠిన వైఖరి ఇపుడు పార్టీలో చర్చగా ఉంది. టీడీపీని దాని మానన వదిలేస్తే భవిష్యత్తులో పెద్దగా ప్రభావం లేకుండా పోతుందని, వారిని కెలికితేనే ముప్పు అన్నది జగన్ సరికొత్త స్ట్రాటజీగా కనిపిస్తోంది.

Related Posts