యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏఎన్ఎంలు, డీఎస్సీ-2018 అభ్యర్థులు బైఠాయించారు. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో తమకు ఉద్యోగాలు కల్పించాలని, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గతప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదే సమయంలో జగన్ తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందోళనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.