Highlights
- ఫాల్గుణ బహుళ విదియ
- శనివారం,మార్చి 3, 2018
- ఈ లోకంలో
- సత్సాంగత్యం కంటే
- పవిత్రమైనది వేరొకటి లేదు
- స్వామి వివేకానంద
సంత్ తుకారం
పాండురంగని భక్తులలో తుకారాం ప్రసిద్ధి చెందినవాడు. లౌకికవాసన బొత్తిగా లేకపోవడం వలన దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. తన చేతిలో ఏది ఉంటే అది దీనజనులకు దానమిచ్చేవాడు.
ఒకనాడు ఒక రైతు స్వామికి చెరకుగడలు అర్పించాడు. వాటిని మోసుకొస్తుండగా వీధిలో బాలురు అతని చుట్టూ మూగి చెరకు ముక్కలడిగారు. వాళ్లందరికీ తలా ఒక గడ ఇవ్వగా ఒక్క గడ మాత్రం మిగిలింది. దాన్ని తెచ్చి భార్యకిచ్చాడు స్వామి. ఆమె వీధిలో అందరి చేతుల్లోనూ చెరకు గడలుండటం గమనించి, జరిగిందేమిటో గ్రహించి ఒల్లెరుగని కోపంతో చెరకుగడతో స్వామినెత్తిన ఒక్కటి వడ్డించింది. అది రెండు సమానమైన ముక్కలైంది. ఒక ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది.
'సమర్థురాలవు సుమా! గడను సమానంగా పంచావు. బాగుంది. నీ చేతిలో ముక్క నువ్వు తిను. ఇది పిల్లలు తింటారు!' అంటూ క్రిందపడిన ముక్కను పిల్లలకు ఇచ్చాడు స్వామి. అంతటి శాంతమూర్తి ఆయన.