కావలసిన పదార్థాలు
బియ్యం- 4 కప్పులు, వేగించిన జీడిపప్పు- 1 కప్పు, జీడిపప్పు పేస్ట్- 1 టేబుల్ స్పూను.
షాజీర- 1 టీ స్పూను, మరాఠీ మొగ్గలు- 2, అనాస పువ్వు- 1, జాపత్రి- 1, జాజికాయ- 1, బిర్యానీ ఆకులు- 2, లవంగాలు- 6, దాల్చిన చెక్క- 1(మూడంగుళాల ముక్క).
గరంమసాల- 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్- 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 3 టీ స్పూన్లు, నిమ్మరసం- 3 టీ స్పూన్లు, కొత్తిమీర, పుదీనా తరుగు- 1 కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 3 టేబుల్ స్పూన్లు, వేగించిన ఉల్లి తరుగు- 1/2 కప్పు, నెయ్యి- 1 టేబుల్ స్పూను.
తయారీ విధానం
బియ్యం కడిగి ఏడెనిమిది కప్పుల నీళ్ళు పోసి గంట సేపు నానబెట్టిన తరువాత ఉప్పు, మసాల దినుసులు, టీ స్పూను నూనె వేసి కాస్త పలుకుగా ఉడికించి నీళ్ళు వార్చేయాలి.
తరువాత ఒక బాణలిలో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాక, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేగించాలి. తరువాత జీడిపప్పు పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాల తరువాత పుదీనా, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
తరువాత గరం మసాల, జీడిపప్పులు, నిమ్మరసం కూడా వేసి కలపాలి. ఆ తరువాత ఒక ఇనుప పెనం మీద ఒక మందపాటి గిన్నె పెట్టి దానిలో ఒక పొర అన్నం, మరో పొర జీడిపప్పు మిశ్రమం వేస్తూ మొత్తం పరిచాక పైన నెయ్యి వేసి ఉల్లి తరుగు జల్లి గిన్నె మీద మూత పెట్టి, ఆవిరిపోకుండా దానిపై ఏదైనా బరువు ఉంచి ఒక గంటసేపు చిన్న మంటమీద ఉడికించాలి.