YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చిత్తూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రేణిగుంట మండలం పూతలపట్టు జాతీయ రహదారిపై దురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన సత్యనారాయణరెడ్డి(40) తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం జైలో వాహనంలో గురువారం రాత్రి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తోన్న వాహనం దురవరాజపల్లి వద్దరకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య విజయలక్ష్మి(38), ప్రసన్న(14), చెన్నకేశవరెడ్డి (12), డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ప్రమాదం తెల్లవారి 4.30 ప్రాంతంలో జరిగినట్టు తెలిపారు. నిద్రమత్తులో కారు నడుపుతూ రోడ్డుకు ఎడమవైపున నిలిపి ఉన్న లారీని డ్రైవర్ గుర్తించలేదని, దీంతో వెనుక నుంచి వాహనాన్ని ఢీకొట్టినట్టు తెలిపారు. మరోవైపు, మలుపు వద్ద లారీని పార్క్ చేయడం కూడా ప్రమాదానికి కారణమని తెలియజేశారు. నిబంధనలకు విరుద్దంగా రాంగ్ పార్కింగ్‌లో వాహనం నిలిపినట్టు వివరించారు. లారీ డ్రైవర్‌పై కూడా కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. అలాగే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవని,
దీనిపై రోడ్లు, భవనాల అధికారులకు కూడా దీనిపై సూచనలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Related Posts