YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరో మిషన్ లో ప్రశాంత్ కిషోర్

మరో మిషన్ లో ప్రశాంత్ కిషోర్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రశాంత్ కిషోర్ మరో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున ఆయన ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యారు. ఈమేరకు
టీఎంసీ తో ఒప్పందం కుదిరింది. ఐ ప్యాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి ఆపార్టీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను కోల్ కత్తా పిలిపించుకుని మాట్లాడారు. టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. వచ్చే నెల నుంచి పీకే టీం తన పనిని పశ్చిమ బెంగాల్ లో ప్రారంభించనుంది. కాగా బీజేపీతో మిత్రపక్షమైన జేడీయూలో ప్రశాంత్ కిషోర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వైఎస్ జగన్ బాటలో నడుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో బెంగాల్‌‌లో బీజేపీ సీట్లు సాధించడంతో దీదీ అప్రమత్తమయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌‌తో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి కోల్‌కతాలో రెండు గంటలపాటు దీదీ-పీకే మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘన విజయంతో ప్రశాంత్ కిశోర్ వ్యూహాల పట్ల ఆమె ఆసక్తి చూపారని తెలుస్తోంది. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉంగా... 2014 ఎన్నికల్లో మమత పార్టీకి 34 స్థానాలు దక్కాయి. కానీ ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ అనూహ్య రీతిలో రెండు స్థానాల నుంచి 18 సీట్లకు ఎగబాకింది. 2021లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ అడుగులేస్తోంది. దీంతో దీదీ అప్రమత్తమయ్యారు. 2016 ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ టీం సేవలను పొందాలని మమత భావించారు. కానీ ఆయన మాత్రం స్పందించలేదు. 2017 యూపీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన వ్యూహాలను రచించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్.. ఐదేళ్ల తర్వాత ఆ పార్టీతో నేరుగా తలపడటానికి సిద్ధమయ్యారు. గత ఏడాది రాజకీయాల్లో చేరిన ప్రశాంత్ కిశోర్.. బిహార్ అధికార పార్టీ జేడీయూ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. బీజేపీ ఒత్తిడితో నితీశ్ కుమార్ లోక్ సభ ఎన్నికల్లో బీజేడీ తరఫున పని చేయలేకపోయారు.ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ 151 స్థానాల్లో గెలవడంతో ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ పెరిగింది. ఆయన కోసం పార్టీలు క్యూ కట్టే పరిస్థితి తలెత్తింది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు 2017 యూపీ ఎన్నికల్లో పని చేయలేదు. కానీ 2014లో మోదీకి, మరుసటి ఏడాది నితీశ్ కుమార్‌కు కోసం.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన రచించిన వ్యూహాలు ఫలించాయి

Related Posts