యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖపట్నం విభజన ఏపీలో అతి పెద్ద నగరం. ఇంతటి విశాలమైన ప్రాంతం 13 జిల్లాలలో ఎక్కడా లేదు. విభజన సమయంలో విశాఖనే రాజధాని అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విజయవాడను ఎంపిక చేసింది. అభివృధ్ధి అంతా అమరావతి పేరు మీదనే జరుగుతోందని అప్పట్ల్లొనే విమర్శలూ వచ్చాయి. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా వెనకబడిపోయిందని కూడా ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ఓటమికి ఇది కూడా అతి ముఖ్యమైన కారణం. దీని మీదనే ఇపుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దృష్టి పెడుతున్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన జనం రుణం తీర్చుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.విశాఖపట్నంలో చంద్రబాబు సర్కార్ తొలి మంత్రివర్గం సమావేశం జరిగింది. అప్పట్లో విజయవాడలో పెద్దగా సదుపాయాలు లేకపోవడంతో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో క్యాబినెట్ మీటింగు పెట్టారు. దాంతో విశాఖనే రాజధాని చేస్తారని కూడా ఆశపడ్డారు. తీరా అరు నెలలు తిరక్కుండానే విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారు. ఈ నేపధ్యంలో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు తాము వివక్షకు గురి అవుతున్నామని బాగా ఆవేదన చెందారు. నాడు వైసీపీకి చెందిన స్థానిక నేతలు కూడా విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇపుడు వారికి అవకాశం దక్కింది. విశాఖను రెండవ రాజధాని చేయమంటున్నారు.ప్రతి ఏడాది మూడు నెలల పాటు విశాఖను రాజధానిగా చేసుకుని ప్రభుత్వాన్ని నడపాలని ఆ పార్టీకి చెందిన యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కోరుతున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా విశాఖలో పెట్టాలని ఆయన అంటున్నారు. దాని ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలు బాగుపడతాయని, అభివృధ్ధి కూడా వికేంద్రీకరణ చెందుతుందని అంటున్నారు. అలాగె విశాఖలో పరిశ్రమలు ఎక్కువగా తీసుకురావాలని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు
కూడా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి జగన్ ఈ ప్రతిపాదనలకు సరేనంటారా లేదా అన్నది చూడాలి.