YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పేటీఎం లో గిఫ్ట్ ఓచర్లతో నగదు బదిలీ 

పేటీఎం లో గిఫ్ట్ ఓచర్లతో నగదు బదిలీ 

పేటీఎం యూజర్లు కేవైసీ వివరాలు సమర్పించనప్పటికీ, గిఫ్ట్‌ ఓచర్ల ద్వారా వాలెట్‌లోకి నగదును లోడ్‌ చేసుకోవచ్చని ఆ కంపెనీ తెలిపింది. నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) వివరాలు సమర్పించనప్పటికీ, పేటీఎం వాలెట్‌లోకి నగదును లోడ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. తగ్గిపోతున్నయూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ఈ గిఫ్ట్‌ ఓచర్లను కూడా  పేటీఎం జారీచేస్తోంది. ఈ గిఫ్ట్‌ ఓచర్లను గ్రే ఏరియాలో ఆపరేటింగ్‌ చేస్తున్నట్టు కూడా ఓ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.డిజిటల్‌ వాలెట్‌ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ వివరాలు సమర్పించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. లేదంటే వాలెట్లు పనిచేయవని, వాలెట్స్‌లోకి కొత్తగా నగదును పంపించుకోవడం జరుగదని పేర్కొంది. ఆర్‌బీఐ యూజర్లు తీసుకొచ్చిన ఈ నిబంధనలతో డిజిటల్‌ వాలెట్లు భారీ ఎత్తున్న తమ కస్టమర్లను కోల్పోతున్నారు. అమెజాన్‌ ఇండియా తన ఈ-వాలెట్‌ యూజర్‌ బేస్‌లో 30 శాతం క్షీణతను నమోదుచేసింది. పేటీఎం కూడా తన కోర్‌ ఈ-వాలెట్‌ బిజినెస్‌లను ఇతర వ్యాపారాలకు విస్తరిస్తోంది. 

Related Posts