YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సొంత ప్రభావం కోసం ఆర్పీ ఠాకూర్ పాకులాట

సొంత  ప్రభావం కోసం ఆర్పీ ఠాకూర్ పాకులాట

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. మొదట సదరు అధికారులపై విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలని మాజీ ఎసిబి డిజి ఆర్పీ ఠాకూర్ బాధితుల సంఘం సభ్యులు అన్నారు. శుక్రవారం వారంతా మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ ఆర్పీ ఠాకూర్ తన సొంత ప్రాభవం కోసం మీడియా దృష్టి ఆకర్షించడం కోసం నిబంధనలు పాటించలేదు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులకు ఇబ్బందులు గురి చేసే వారు తనకు నచ్చిన మీడియా ను తీసుకు వచ్చి ఆస్తుల విలువను పబ్లిసిటీ కోసం పెంచి చూపేవారని ఆరోపించారు. అధికారులను అల్లరిపాలు చేసేవారు. అక్రమాస్తుల కేస్ లలో సదరు వ్యక్తి పూర్వాపరాలు పరిశీలించకుండా, ఎవరు ఫిర్యాదు చేశారో కూడా పట్టించుకోకుండా చర్యలు తీసుకునేవారని అన్నారు. సరైన సాక్ష్యాలు ఉన్నాయా లేదా కూడా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు కేస్ లు పెట్టారు. కింది స్థాయి అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ ఇబ్బందులు పెట్టేవారని అన్నారు. శాఖల్లో నెంబర్ 2 స్థాయిల్లో ఉన్నవారిని టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారు. సుప్రీం కోర్ట్ తీర్పు అక్రమాస్తుల కేస్ లో విచారణ ఎదుర్కొంటే 6 నెలల్లోగా తిరిగి నియామకం ఇవ్వాలి కానీ పోస్టు ఇవ్వకుండా అడ్డతగిలేవారని విమర్శించారు. అధికారులు సంవత్సరాలు గడిచినా ఆస్తులు ఆటచ్ అయ్యి పోస్టులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ కోర్టుల ఆక్ట్ ప్రకారం జప్తు చేసిన ఆస్తులను కేస్ పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వ అవసరాలకు ఆ ఆస్తులను వాడుకునేల చేశారని అన్నారు. చట్ట ప్రకారం అవినీతి అధికారులకు శిక్ష పడాలి,కింది స్థాయి అధికారులకు టార్గెట్ లు పెట్టడం వలన తప్పు చేయని వారిపై కేస్ లు పెట్టారు. ఠాకూర్  హయాంలో తప్పు చేయని అధికారులపై పెట్టిన అక్రమ కేస్ ల విచారణ త్వరగా పూర్తి చేయాలని వారంతా డిమాండ్ చేసారు.

Related Posts