యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీ ఇంధన ధరలు వరుసగా మూడోరోజు కూడా తగ్గుముఖం పట్టాయి. శనివారం (జూన్ 8) పెట్రోల్ ధర 22 - 23 పైసలు, డీజిల్ ధర 25 - 27 పైసల మేర తగ్గాయి. దేశరాజధానిలో
పెట్రోలు ధర 22 పైసలు తగ్గి రూ.70.72 వద్ద, డీజిల్ ధర 25 పైసలు తగ్గి రూ.64.65 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ పెట్రోలు ధర 22 పైసలు తగ్గి
రూ.76.41 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.67.79 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.75.26 వద్ద, డీజిల్ ధర 27 పైసలు
తగ్గి రూ.70.46కి చేరాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర 22 పైసలు తగ్గుదలతో రూ.74.93కు క్షీణించింది. డీజిల్ ధర 26 పైసలు క్షీణతతో రూ.69.88కి పతనమైంది. ఇక విజయవాడలో పెట్రోల్ 22 పైసలు, డీజిల్ ధర 27 పైసలు క్షీణించింది. దీంతో పెట్రోల్ ధర రూ.74.58 వద్ద, డీజిల్ ధర రూ.69.55 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.63 శాతం పెరుగుదలతో 63.29 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.66 శాతం పెరుగుదలతో 53.99 డాలర్లకు ఎగసింది.