YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అధికారాలు లేని నీతిఅయోగ్ మీటింగ్ కు రానంటున్న మమతా

 అధికారాలు లేని నీతిఅయోగ్ మీటింగ్ కు రానంటున్న మమతా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్రంలోని మోదీ సర్కారు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొంతకాలంగా ప్రధాని మోదీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న ఆమె మరోసారి తన నిరసన వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారని, ఎటువంటి అధికారాలు లేని ఆ కౌన్సిల్ సమావేశానికి తాను హాజరు కాబోనని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మోదీకి లేఖ రాశారు. ‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు. రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యం అందులో లభించదు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావు’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ.. ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015లో నీతీ ఆయోగ్‌ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు కట్టబెట్టకుండా నిబంధనలు తెచ్చారు. రాష్ట్రాలకు ఇందులో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. సలహాలు, సూచనలకు మద్దతు లభించదు. కాబట్టి ఇటువంటి సంస్థ సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావు’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. జూన్‌ 15న నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ పునర్‌ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాజీవ్‌ కుమార్‌ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇందులో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేరనున్నారు. ప్రధాన మోదీ చైర్మన్‌గా వ్యవహరించే నీతి ఆయోగ్‌లో కే సరస్వత్‌, రమేష్‌ చాంద్‌, డాక్టర్‌ వీకే పాల్‌ సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఈ భేటీకి హాజరుకానున్నారు.వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వాటర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు

Related Posts