యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని కులాల వారికి సమన్యాయం జరిగిందని వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు నాగరత్నమ్మ తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి వద్ద వాల్మీకులు నాగరత్నమ్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి గుమ్మనూరు జయరాంకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన అందుకు జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు,వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు