YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికారంలో లేమని అధైర్య పడొద్దు చంద్రబాబునాయుడు చెప్పిందే చేశారు...చేసి చూపించారు

 అధికారంలో లేమని అధైర్య పడొద్దు     చంద్రబాబునాయుడు చెప్పిందే చేశారు...చేసి చూపించారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా చెప్పినవే చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా వర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ అధికారంలో లేమని ఎవరూ అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకుని ముందుకు వెళతాన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని అవగాహన చేసుకుని ఇచ్చిన ఆ హామీని ఎంత వరకూ అమలు చేస్తున్నారు... నిజంగా అర్హులకే ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయో లేదో పరిశీలించి అధికార పార్టీ చేసే తప్పులను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. చేసే ప్రతి పని న్యాయబద్దంగా ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా చేయాలన్నారు. ప్రతి విషయంలనూ మనం యాక్టీవ్‌గా ఉండాలన్నారు. మన తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాలన్నారు. మన నాయకుడు చంద్రబాబు ఇమేజ్‌ను కాపాడుతూ... జగన్‌ కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఇద్దరి పాలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే యాప్‌ను ఒకటి తయారు చేస్తున్నామని, దానిలో పార్టీ తరపున చేపట్టే ప్రతి కార్యక్రమం అప్‌డేట్‌ వస్తుందని, ఆ యాప్‌ ద్వారా నిత్యం ప్రజలకు చేరువలో ఉండాలన్నారు. ఆ యాప్‌ ద్వారా ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను నిత్యం సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. అలాగే జగన్‌ ప్రజలకు ఇచ్చి మరచిన హామీలను గుర్తించి ప్రజల్లో
అవగాహన కల్పించాలన్నారు. మన ఎమ్మెల్యే పరిధిలో ఉన్న ప్రతి పనిని మనం ధైర్యంగా చేయించుకోగలమని, ఏ విషయంలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయం లేకుండా ముందుకు వెళ్ళాలని, ప్రతి విషయంలోనూ అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ యువత పాల్గొన్నారు.

Related Posts