బీజేపీ డీఎన్ఏలోనే జాతీయవాదం ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. జాతీయవాదమే బీజేపీకి గుర్తింపని తెలిపారు. బీజేపీ అంటేనే జాతీయవాదం. జాతీయవాదమంటేనే బీజేపీ అని రామ్ మాధవ్ వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించిందన్న ఆయన.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2022నాటికి భారతదేశం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు.నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు దేశంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా మోదీ నాయక్వంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. 2047నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.