YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాల్దీవులలో ప్రధాని మోడీ

మాల్దీవులలో ప్రధాని మోడీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాల్దీవులకు చేరుకున్నారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారిగా మాలీని సందర్శిస్తున్నారు. మొదటి టర్మ్‌లో మోదీ సందర్శించని పొరుగు దేశంగా మాల్దీవులు ఒక్కటే నిలిచింది. 2011లో ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి అందజేయనున్నారు. వాణిజ్య, సివిల్‌ సర్వెట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.ప్రధాని మోదీ నేడు మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటి విదేశీ పర్యటనలో భాగంగా నేడు మాల్దీవుల్లో, రేపు శ్రీలంకలో మోదీ పర్యటిస్తారు. ఈ టూర్ లో భాగంగా ప్రధాని మాల్దీవుల్లో జాతీయ రక్షణ దళం శిక్షణా కేంద్రంతో పాటు అత్యాధునిక తీరప్రాంత రాడార్ నిఘా వ్యవస్థను మోదీ ప్రారంభిస్తారు ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజుద్దీన్’ అవార్డును ప్రకటించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రధాని అబ్దుల్లా షాహీద్ ప్రకటించారు. ఈ పర్యటన తర్వాత శ్రీలంకకు ఆదివారం వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఈస్టర్ ఉగ్రదాడుల్లో చనిపోయిన ప్రజలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. తిరిగి అదేరోజున భారత్ కు చేరుకుంటారు.

Related Posts