తనను ఓడించడానికి ప్రత్యర్థులు రూ. 150 కోట్లను ఖర్చు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్న వర్మ, పవన్ ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని వ్యాఖ్యానించారు. తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు అవినీతిపరులన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.