Highlights
- అన్నారం బ్యారేజీ
- కన్నెపల్లి పంపుహౌజ్
- నిర్మాణ పనుల పరిశీలన
- సివిల్ విద్యార్థులతో పాటు ఓయూ ప్రొఫెసర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సందర్శించారు. కాళేశ్వరం సందర్శనలో భాగంగా... అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్ నిర్మాణ పనులను వాళ్లు పరిశీలించారు. ఈ పర్యటనలో సివిల్ బ్యాచ్‌కు చెందిన 45 మందితో పాటు ఓయూ ప్రొఫెసర్లు కూడా ప్రాజెక్టును సందర్శించారు.